జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెరాస ఎన్ని సీట్లు గెలుస్తుందో నేను చెబుతా..?: లగడపాటి (News| AP News| TRS| Telangana| Lagadapati| KCR| Greater Elections| Supreme Court| Free Zone)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేస్తుందో? లేదో అన్న విషయాన్ని చెబితే ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయాన్ని తాను చెబుతానని విజయవాడ ఎంపీ లగడపాటి అన్నారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ వైఖరిపై మండిపడిన లగడపాటి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మీడియాలో జీవించడం కాదని, ప్రజల్లో జీవించాలని హితవు పలికారు.

హైదరాబాద్ ఫ్రీజోన్‌పై సుప్రీం కోర్టుకు వెళ్లినవారిలో తెలంగాణ వాదులున్నారని లగడపాటి గుర్తు చేశారు. కోర్టుకు వెళ్లిన వారిలో తెలంగాణ వాదులు లేరని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకంటానని లగడపాటి సవాల్ చేశారు.

నిజంగా కేసీఆర్‌కు హైదరాబాద్ మీద ప్రేముంటే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు పాటుపడిన వారిని విద్రోహులుగా చిత్రీకరించడం బాధకరమని, వారిని ప్రజలు క్షమించరని లగడపాటి అన్నారు. కేసీఆర్ తెలంగాణ రక్షకుడు కాదని, ప్రజల పాలిట భక్షకుడని లగడపాటి ఆరోపించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.