ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే (Sri Lanka President RajaPakse, Tirupati, Sri Venkateswara swamy, Tirumala, News, AP News)
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే
FILE
ఆపద మొక్కులవాడు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే శనివారం దర్శించుకున్నారు. లంక నుంచి ప్రత్యేక విమానం ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం తిరుమలకు చేరుకున్నారు.
తిరుమలకు చేరుకున్న రాజపక్సేను తిరుమల పండితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. మహాద్వారం ద్వారా రాజపక్సేను ఆలయంలోకి ప్రవేశం కల్పించడంతో.. రాజపక్సే శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వరుని దర్శనం పూర్తయ్యాక సాయంత్రం తిరుపతి నుంచి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే శ్రీలంకకు పయనమవుతారు.
ఇదిలా ఉంటే.. నిబంధనలకు విరుద్ధంగా మహాద్వారం నుంచి రాజపక్సే అంతరాలయంలోకి ప్రవేశించారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు.. శ్రీవారి దర్శనార్థం శనివారం రాజపక్సే తిరుమలకు చేరుకోవడంతో రాష్ట్ర పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. తిరమల కొండపై అదనపు బలగాలను మోహరించింది.