ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » "సురేఖ" రాజీనామా వెనుక "జగన్" ప్రోద్బలం లేదు..! (Greater Hyderabad Elections| Veerappa Moily| CLP| Surekha| Jagan| Flood| News| AP News)
మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ రాజీనామా వెనుక వైఎస్సార్ తనయుడు జగన్ ప్రోద్బలం ఉందని పార్టీలోని ఓ వర్గం చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. సురేఖ రాజీనామా ఆమె వ్యక్తిగత విషయమని మొయిలీ అన్నారు.
గ్రేటర్ ఎన్నికలపై చర్చించడానికి నగరానికి వచ్చిన మొయిలీ పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా గ్రేటర్ ఎన్నికలు, సీఎల్పీ సమావేశం, కొండా సురేఖ రాజీనామా వ్యవహారం వంటి పలు అంశాలపై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా మొయిలీ మాట్లాడుతూ.. సీఎల్పీ సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని భావించినా వరదలు, మూడు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆలస్యమైందని చెప్పారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోపే కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమవుతుందని మొయిలీ స్పష్టం చేశారు.