రాష్ట్ర రాజధానిలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య పొత్తు కుదరనుందని ప్రరాపా వర్గాలు తెలిపాయి.
గ్రేటర్ హైదరాబాద్‌కు ఈ నెలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనుందని, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య పొత్తు విషయమై ప్రరాపా అధినేత చిరంజీవి సమక్షంలో చర్చలు జరుగుతాయని ప్రజారాజ్యం అగ్రనేత బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు.
తమ అధ్యక్షుని ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని, దీంతో ఇరు పార్టీలకు లబ్ది చేకూరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తులు సహజమేనని, పొత్తువలన తమ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన అభిప్రాయపడ్డారు.