జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మా పార్టీని విమర్శించే హక్కు లేదు: ప్రరాపా (AP | State | Grater HYD | Election | National Party | Congress | TDP | PRP | Kanna Babu)
Feedback Print Bookmark and Share
 
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ అయిన ప్రజారాజ్యం పార్టీ పొత్తుకు సంబంధించి తెదేపా నేతలకు విమర్శించే హక్కు లేదని ప్రరాపా నేతలు ఘాటుగానే సమాధానమిచ్చారు.

ఆదివారం ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మల్యే కన్నా బాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో దగాకోరు రాజకీయాలు చేయడంలో పేటెంటు పొందిన తెదేపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలకు తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.

గతంలో ఎన్నో ఎన్నికల్లో పలు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలను దగా చేసిన ఘనత చంద్రబాబుదేనని, ప్రరాపాను కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారని విమర్శించడం ఆ నేతలకు తగదని ఆయన విమర్శించారు.

గతంలో ఆ పార్టీ అగ్రనేత దేవెగౌడను ప్రధానిని చేసే విషయంలో తేదేపా కాంగ్రెస్ పార్టీకి దాసోహమైందని, ఈ విషయాన్ని వారు మరిచిపోయినట్లున్నారని ఆయన ఆవేశంగా అన్నారు.

పీఆర్పీ నేతల్ని తెదేపాలో చేర్చుకుని పదవులు ఇవ్వకుండా దగా చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాంగ్రెస్, ప్రరాపాలు పొత్తు పెట్టుకుంటే తమ పార్టీకి పుట్టగతులుండవని తెదేపాకు గుబులు పుట్టుకుందని ఆయన విమర్శించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.