జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన పొన్నాల: కొండ (Jalayaghnam | Minister Ponnala | Konda Surekha | MLC | Pavuralla Gutta)
Feedback Print Bookmark and Share
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య ధనయజ్ఞంగా మార్చారని ఎమ్మెల్సీ కొండా మురళీ ఆరోపించారు. మంత్రి పొన్నాల వైఖరి వల్ల ఈ ప్రాజెక్టు నీరుగారి పోతోందని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి నేతను జిల్లా నుంచే తరిమి కొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

దీనిపై ఆయన సోమవారం మాట్లాడుతూ.. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన పొన్నాల లక్ష్మయ్య కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ఎస్సారెస్సీ, దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లేక పోవడం వల్ల ఏ ఒక్క ఎకరానికీ నీరు అందలేదన్నారు.

ఈ కుంభకోణాలపై ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు జోక్యం చేసుకుని సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ మానసపుత్రికగా అభివర్ణించే జలయజ్ఞాన్ని పొన్నాల నీరుగార్చాలని కొండా మురళి దుయ్యబట్టారు.

అనంతరం ఆయన తన భార్య కొండా సురేఖతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్సార్ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన పావురాలగుట్టకు బయలుదేరి వెళ్లారు. ఇక్కడ వారు వైఎస్‌కు నివాళులు అర్పిస్తారు. కొండా దంపతుల వెంట వందలాది మంది కార్యకర్తలు, అనుచరులు భారీ ర్యాలీగా వెళ్లారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.