జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » చర్యకు సమానమైన ప్రతి చర్య తప్పదు: రఘువీరా (Action | Minister | Raghuveera | Congress | PRP | Jagan Team | GHMC)
Feedback Print Bookmark and Share
 
దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంతగా పైకి ఎదుగుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ - ప్రజారాజ్యం పొత్తుపై ఆయన మండిపడ్డారు. దీనిపై ఆయన సోమవారం మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు కంటే ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీలోని జగన్ వర్గానికి చెక్ పెట్టాలన్న ఏకైక ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉందన్నారు. చర్యకు ప్రతి సమానమైన చర్య ఉంటుందనే విషయాన్ని నేతలు విధిగా గ్రహించాలని ఆయన హెచ్చరించారు.

అంతేకాకుండా, జగన్ వర్గాన్ని ఎంతగా అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంతగా పైకి ఎదుగుతామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఒంటరిగానే పోటీ చేయవచ్చని ఆయన అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.