ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » చిరంజీవికి సిగ్గు లేదా...?: జీవిత-రాజశేఖర్ (Jeevita | Rajasekhar | Prajarajyam | Chiranjeevi | Congress | D Srinivas)
కాంగ్రెస్- ప్రరాపా గ్రేటర్ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంపై జీవితా- రాజశేఖర్ దంపతులు మండిపడ్డారు. ఓ ప్రైవేటు ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ నాయకులను పంచెలు ఊడదీసి తన్నండంటూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినపుడు... సమర్థించిన చిరంజీవి తిరిగి ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. సిగ్గు ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోరని ఘాటుగా స్పందించారు.
అసలు చిరంజీవికి ప్రజలలో బలమే లేదనీ, ఆయన ఓ జీరో అని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను అణగదొక్కేందుకే కొంతమంది ఓడిపోయిన నాయకులు పనిగట్టుకని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకవచ్చి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిలో వైఎస్ జగన్ వెంటనే స్పందించాలని, ప్రజలు కోరిక మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు.