ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » చివరి క్షణాల్లో మౌనంగా సేదతీరిన వైఎస్: నివేదిక (YS | Helicaptor | Rudrakota | Pavuralla Gutta | Hyd | Rachabanda)
జనహృదయ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తన చివరి క్షణాల్లోనూ సేదతీరుతూ, మౌనంగానే తిరిగిరాని లోకాలకు చేరుకున్నట్టు సమాచారం. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి లోనయ్యే ముందు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే పావురాల గుట్టను ఢీకొంది. హెలికాప్టర్ నిర్ధేశిత మార్గాన్ని తప్పిపోవడం, ఎత్తైన గుట్టను ఢీకొనడం అంతా క్షణాల్లో జరిగిపోయినట్టు కాక్‌పీట్ వాయిస్ రికార్డర్ (సీవీఐర్) వెల్లడిస్తోంది.
అయితే, ఇందులో నమోదైన పూర్తి సంభాషణలు వెల్లడి కావాల్సి ఉంది. సీవీఆర్ సమాచారం మేరకు చివరి క్షణాలలో హెలికాఫ్టర్‌లో ఎవరూ ఎటువంటి భయానికీ గురి కాలేదని తెలుస్తోంది. ఈ సీవీఆర్ సమాచారం ప్రాథమిక కాపీని ఒక ఆంగ్లపత్రిక సంపాదించింది. రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ సెప్టెంబరు రెండో తేదీన నల్లమల అడవుల్లోని రుద్రకోట సమీపంలో పావురాలగుట్టను హెలికాఫ్టర్ ఢీకొన్న సంఘటనలో మృతి చెందిన విషయం తెల్సిందే.
ఆ సమయంలో ముఖ్యమంత్రి ఉల్లాసంగా, మౌనంగా సేద తీరుతూ ఉండవచ్చని పేర్కొంది. సీవీఆర్‌లో ఆయన సంభాషణలేవీ నమోదు కాకపోవడం ఈ కోణంలో ఆలోచన చేయాల్సి వస్తోంది. అలాగే, తమ హెలికాఫ్టర్ దారి మళ్ళినట్లు సూచిస్తూ పైలట్లు ఆందోళనకరమైన సమాచారం కూడా ఏదీ పంపలేదని తెలుస్తోంది. ముందు ఏమున్నదో కూడా కనిపించనంతగా వర్షం కురుస్తున్న స్థితిలో హెలికాఫ్టర్ ముందుకు సాగిందని, ఆ సమయంలో హెలికాప్టర్ 140 నాటికల్ మైళ్ల వేగంతో లేదా గంటకు దాదాపు 259 కిలోమీటర్ల వేగంతో కొండను ఢీకొని ఉండవచ్చని సమాచారం.
సాధారణంగా హెలికాఫ్టర్ తమ నిర్ధేశిత మార్గం తప్పిపోయినా.. ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా పైలట్ల మధ్య సంభాషణలు జరుగుతాయి. ఇలాంటివేమీ ఇందులో చోటు చేసుకోక పోవడం గమనార్హం. సీఎం క్యాబిన్‌లో సేద తీరుతున్నందున నిశ్శబ్ధాన్ని భగ్నం చేయడం ఇష్టం లేకే పైలెట్లు మౌనం పాటించి ఉంటారని భావిస్తున్నారు. కానీ ఈ మౌనాన్ని భంగపరుస్తూ హెలికాఫ్టర్ ఒక కొండను ఢీకొని ఉండవచ్చని, ఆ సమయంలో అందులో ఉన్న వారు మృత్యువాత పడి ఉంటారని తెలుస్తోంది.