దేవరకద్ర నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి అరెస్టుపై రాష్ట్ర హైకోర్టు మంగళారం స్టే విధించింది. ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉన్న విషయ తెల్సిందే.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి ఎమ్మెల్యే సీతా దయాకర్‌తో పాటు. మరికొంతమంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు రాజేశ్వరి మరణ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో సీతా దయాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె బెయిల్ కోరుతూ స్థానిక కోర్టులో పెట్టుకున్న పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో.. ఆమె అరెస్టు వ్యవహారంపై హైకోర్టు స్టే విధించింది.