జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » వైఎస్.జగన్‌తో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ! (YS Jagan | Ministers | MLA | Hyd | GHMC | Election | CM Camp Office)
Feedback Print Bookmark and Share
 
కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై వీరు చర్చించినట్టు సమాచారం.

కాగా, జగన్‌ను కలిసిన వారిలో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర గనుల శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సమాచార, ఐటీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌‌తో పాటు కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, పలు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు.

తన నివాసానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ పలుకరిస్తూ.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా, గత రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే, భవిష్యత్‌లో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించినట్టు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.