ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఈనెల 5వ తేదీన కాంగ్రెస్ గ్రేటర్ అభ్యర్థుల జాబితా! (GHMC Election | Congress | DS | PCC | Veerappa Moily | YSR | Daanam)
వచ్చే ఐదో తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు దానం మంగళవారం ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌తో సమావేశయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఖరారైన అభ్యర్థుల జాబితాను వచ్చే ఐదే తేదీన వెల్లడించనున్నట్టు తెలిపారు.
ఇందుకోసం బుధవారం సాయంత్రం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ రాష్ట్రానికి వస్తున్నట్టు తెలిపారు. ఆయనతో తుది దఫా చర్చలు జరిపిన పిదప తొలి జాబితా విడుదల అవుతుందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటిరిగానే బరిలోకి దిగి, సత్తా చాటుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం జరుగుతున్న తొలి స్థానిక ఎన్నికలని అందువల్ల ప్రజల కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.