జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరి పోరే: తేల్చి చెప్పిన ప్రరాపా (Congress | PRP | Greater | Election | Ganta | Chiru | DS |, Raghuveera)
Feedback Print Bookmark and Share
 
త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ తేల్చిచెప్పింది. అలాగే, ప్రరాపాను కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ మంత్రి రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రరాపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయాల్లో తమ పార్టీ పావుగా మారబోదని పిఆర్పీ నేతలు గౌతం, అనిల్, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యానందరావు, కన్నబాబు స్పష్టం చేశారు.

దీనిపై వారు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ విలీనం కావడం అంటే కలలో మాట అని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకునే కంటే కాంగ్రెస్‌లోనే ఆ పార్టీని విలీనం చేస్తే మంచిదని మంత్రి రఘువీరారెడ్డి, మరికొందరు కాంగ్రెస్ నాయకులు సోమవారంనాడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తమతో పొత్తుకు కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాసే వెంపర్లాడారని చెప్పారు. ఇకపై ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోమన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ముగిసిందని ఇప్పుడు తాము ఒంటరిగా పోరాటం చేయడానికే నిర్ణయించుకున్నట్టు తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ అధిష్టానం ముందుగా ముందుకు వచ్చి పొత్తు విషయం ప్రస్తావిస్తేనే ప్రజారాజ్యం పార్టీ అందుకు సుముఖత వ్యక్తం చేసిందని, ఒంటరిగా బరిలో దిగే సత్తా తమకు ఉందని పిఆర్పీ నాయకులు గౌతం, అనిల్, గంటా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం అవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని వీరు ఖండించారు. కాంగ్రెస్ రాజకీయాన్ని కాస్త ఆలస్యంగా అర్థం చేసుకున్నామని వారు చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.