ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో లాభం: తెదేపా (Congress | TDP | Greater | Hyd | Ranga Reddy | Candidates | Devendra Gowd)
కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే తమకు మేలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలోని 45 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసిన జాబితాను పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించామని తెలిపారు. తుది జాబితాను ఆయన ప్రకటిస్తారని తెలిపారు.
దీనిపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు తమకు లాభిస్తాయన్నారు. ముఖ్యంగా, ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు, వర్గపోరు, గ్రూపు రాజకీయాలు గ్రేటర్ ఎన్నికల్లో తమకు అనుకూలాంశాలని చెప్పారు.
ఈ ఎన్నికల్లో అనుసరించనున్న వ్యూహాలపై అధినేతతో చర్చించినట్టు మహేందర్ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇదిలావుండగా, తెలుగుదేశం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనుంది.