జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » బాక్సర్ ఆత్మహత్యపై విచారణకు మంత్రి ఆదేశం (Women Boxer | LB Stadium | Coach | Omkar | Amaravathi | Hyderabad)
Feedback Print Bookmark and Share
 
రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో అత్మహత్య చేసుకున్న మహిళా బాక్సర్ అమరావతి ఉదంతంపై విచాణకు ఆదేశిస్తున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖామంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ హాస్టల్‌లోని తన గదిలో మహిళా బాక్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించి వున్న విషయం తెల్సిందే.

బాక్సింగ్ కోచ్ ఓంకార్ యాదవ్ వేధింపుల కారణంగానే ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, వేధింపుల వల్లే బాక్సర్ ఆత్మహత్య చేసుకున్నట్టు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, అమరావతి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తను తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ జరుపుతున్నారు. గదిలో ఉన్న ఇతర సాక్ష్యాధారాలను వారు సేకరిస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.