ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ బాధ్యతలు మావే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (GHMC | Hyd | Congress | MLA's | Candidates | DS | PCC | Rosaiah)
త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల గెలుపు ఓటముల బాధ్యతను పూర్తిగా తామే స్వీకరిస్తున్నట్టు కాంగ్రెస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు రాజిరెడ్డి, భిక్షపతియాదవ్, కె.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌తో సమావేశమై చర్చించారు.
ఈ సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్.జగన్‌ను ప్రచారం చేయమని కోరుతామన్నారు. స్థానిక అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉన్నందువల్ల అభ్యర్థుల ఖరారు, జాబితా విడుదలలో ఆలస్యమైందని చెప్పారు. ఇదిలావుండగా, బుధవారం రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ పర్యటన రద్దు అయింది.
ఆయన పర్యటన రద్దుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇదిలావుండగా, గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థుల ఎంపిక కోసం పీసీసీ చీఫ్ డీఎస్, ముఖ్యమంత్రి రోశయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్‌లు బుధవారం నగర శివార్లలోని ఒక రిసార్ట్స్‌లో రహస్యంగా భేటీ అయ్యారు.