జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తన అభిమాన హీరో చెంతకు ఐరెన్ లెగ్ రోజా! (Chiru | PRP | Roja | Chandragiri | TDP | Congress | YS | Cinema | Heroine)
Feedback Print Bookmark and Share
 
File
FILE
హీరోయిన్‌గా తన అందచందాలను ఆరబోసిన నటి రోజా. తెలుగుదేశం పార్టీలో చేరి తన వాగ్ధాటితో ప్రత్యర్థి నేతలతో మాటల తూటాలను పేల్చి రాష్ట్ర రాజకీయాల్లో తనకుంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న రాజకీయ వనిత. ప్రస్తుతం ఈమె భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.

ఒకనాడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన రోజా.. ఆ తర్వాత వైఎస్సార్ పథకాలకు ఆకర్షితులయ్యారు. వైఎస్ దుర్మరణానికి ముందుగా ఆయనతో సమావేశమై కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సమ్మతించారు. ఇంతలో ఆ జన హృదయ నేత తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. దీంతో ఆమె భవిష్యత్ ఎటూ కాకుండా పోయింది.

తిరిగి తన సొంతగూడు తెదేపాలోకి వెళ్లలేని దయనీయ స్థితి. పైపెచ్చు వైఎస్ లేని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సాహసం చేయలేని దుస్థితి. దీంతో ఏం చేయాలో రోజాకు పాలుపోవడం లేదు. అయితే, తాను ఒక విద్యార్థినిగా ఉన్న సమయం నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే మహా పిచ్చి అభిమానం.

ఆ అభిమానమే చిరంజీవితో కలిసి నటించేందుకు పలు చిత్రాల్లో అవకాశం దక్కేలా రోజాకు చేసింది. ఇపుడు ఆ అభిమానంతోనే చిరంజీవి చెంతకు వెళ్లాలని రోజా భావిస్తున్నారు. దీనికి ఆమె అనుచరులు, సోదరులు సైతం సమ్మతం సమాచారం. అయితే, ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందే వేచి చూడాల్సిందే.

పైపెచ్చు.. గత ఎన్నికల ప్రచారంలో చిరంజీవిపై రోజా వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. అందువల్ల ఆమె అటు వైపు మొగ్గు చూపక పోవచ్చని కొందరు అంటున్నారు. అయితే, రాజకీయాల్లో "శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు" ఉండరు అనే నానుడి అందరికీ గుర్తుండే ఉంటుంది.

దీన్ని రుజువు చేసేలా రోజా నిర్ణయం ఉండినా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే, రోజా రాకను ప్రజారాజ్యం మహిళా నేత, ఫైర్‌బాండ్ శోభారాణి వంటి వారు అంగీకరిస్తారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.