ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » విద్యార్థి అనూష ఆత్మహత్యపై విచారణకు ఆదేశం (Hyd | Somajiguda | Villa Mery College | Student | Sucide | Building)
హైదరాబాద్, సోమాజీగూడాలోని విల్లామేరీ కళాశాలకు చెందిన విద్యార్థిని అనూష ఆత్మహత్యపై ఉన్నత విద్యామండలి విచారణకు ఆదేశించింది. ఈ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అనూష.. గురువారం ఉదయం కళాశాల భవనం మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకింది.
దీంతో తీవ్రంగా గాయపడిన అనూషను యశోదా ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఇదిలావుండగా, తమ కుమార్తె సాటి విద్యార్థుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని అనూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.