జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » "గ్రేటర్" మహా సమరానికి తెరాస దూరం: కేసీఆర్ (Greater | Election | KCR | Telangana | Delhi Tour | People | Assembly)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి తప్పుకుంది. గ్రేటర్ ఎన్నికల కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటే తమ ధ్యేయమని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.

దీనిపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు మాకు ప్రాధాన్యం కాదన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసేదిలేదన్నారు. తెలంగాణ ఉద్యమం ఈ సారి మధ్యస్తంగా ముగిసేది కాదని ఏదో ఒకటి తేల్చుకుంటామన్నారు.

ఇందుకోసం ఈనెల 6వ తేదీ శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ సంస్థల నేతలతో సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇందులోభాగంగా ఏడు, ఎనిమిది, తొమ్మిది తేదీల్లో తెంగాణలోని 119 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఒకవైపు వీటిని నిర్వహిస్తూనే మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇందుకోసం ఈనెల 10వ తేదీన హస్తినకు వెళ్లనున్నట్టు తెలిపారు. అలాగే, ఈనెలాఖరు నుంచి తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు.

తెలంగాణా ప్రజలు నా శవయాత్రలో పాల్గొంటారో లేక విజయయాత్రలో పాల్గొంటారో వారే తేల్చుకోవాలన్నారు. తనను ఆదుకున్నా.. వదిలేసినా అది తెలంగాణా ప్రజల చేతుల్లోనే ఉందని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇదిలావుండగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది నేతలు నామినేషన్లు దాఖలు చేయడం కొసమెరుపు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.