గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై డైలామాలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ వైఖరితో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అభిప్రాయపడింది.
దీంతో ఆ పార్టీకి చెందిన గ్రేటర్ హైదరాబాద్ కార్యకర్తలు చిరు వైఖరిపై గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా, పార్టీ ప్రధాన కార్యాలయానికి భారీగా తరలి వచ్చి చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.