జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కాంగ్రెస్‌లో గ్రేటర్ లొల్లి: గ్రేటర్ పదవికి దానం గుడ్‌బై! (Congress | Greater | Danam | Nagendar | DS | Resign | Tickets)
Feedback Print Bookmark and Share
 
File
FILE
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్‌లో అలజడి సృష్టిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలను డబ్బులకు అమ్ముకున్నారని పలువురు ఆరోపించారు. వీటితో కలత చెందిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ రాజీనామా చేశారు.

అయినప్పటికీ.. టిక్కెట్‌ను ఆశిస్తున్న వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఇంటిని ముట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో డీఎస్ ఇంటిముందు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. ఫలితంగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్ టిక్కెట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడటమే కాకుండా, స్థానికులను పక్కన పెట్టి, ఇతర పార్టీ అభ్యర్థులకు రాత్రికి రాత్రి కేటాయించారని ఆరోపిస్తున్నారు. దానంతో పాటు డీఎస్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిలు ఏకమై టిక్కెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతల ఆరోపిస్తున్నారు.

ఇప్పటి వరకు ఖరారు చేసిన గ్రేటర్ అభ్యర్థుల జాబితాపై గ్రేటర్ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో కలత చెందిన దానం.. రాజీనామా చేశారు. ఆయన శుక్రవారం ఉదయం స్వయంగా పీసీసీ చీఫ్ డీఎస్ నివాసానికి వచ్చి తన రాజీనామా లేఖను సమర్పించి వెళ్లిపోయారు.

అయితే, రాజీనామాను ఆమోదించేదీ లేనిదీ డీఎస్ చేతుల్లో ఉంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే భిక్షపతి మాట్లాడుతూ... దానం టిక్కెట్లు అమ్ముకున్న మాట వాస్తవమేనని అందువల్ల ఆయన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.