జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాజీనామా బాటలో గ్రేటర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు! (Resign | Greater | Hyd | Congress | MLA's | DCC | PCC | DS | Lakshma Reddy)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శాసనసభ సభ్యులు రాజీనామా దిశగా యోచన చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తమ ప్రమేయం లేకుండా పూర్తి చేయడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని భావిస్తున్నారు.

ఇదిలావుండగా, గ్రేటర్ ఎన్నికల టిక్కెట్లను అమ్ముకున్నట్టు ఆరోపణలు రావడంతో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ డీఎస్‌కు శుక్రవారం అందజేశారు.

ఈ నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దానం రాజీనామా చేయడంలో ఆంతర్యమేమిటని ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీశైలం గౌడ్‌లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాపై మరోమారు సమీక్ష నిర్వహించి శుక్రవారం సాయంత్రం లోగా అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అలాకానీ పక్షంలో తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. మాటమాత్రం తమను సంప్రదించకుండా తమ పరిధిలోని అభ్యర్థులను ఎలా ఖారరు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.