ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » టిక్కెట్లు అమ్ముకోవడం కాంగ్రెస్ సంస్కృతి: ఎంపీ సర్వే (Tickets | Sale | Congress | Culture | MP Survye | Greater | DS | Election)
టిక్కెట్లు అమ్ముకోవడం కాంగ్రెస్ సంస్కృతి: ఎంపీ సర్వే
శుక్రవారం, 6 నవంబర్ 2009( 13:36 IST )
ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకోవడం కాంగ్రెస్ సంస్కృతిలో భాగమని ఆ పార్టీ ఎంపీ సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, నిజమైన కార్యకర్తలకు, గెలుపు గుర్రాలకు అన్యాయం జరగడం అనేది ప్రతి ఎన్నికల్లో చూస్తూ వస్తున్న విషయమేనని తేల్చి చెప్పారు.
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అనుచరులకు టిక్కెట్లు కేటాయించలేదని తెలుసుకున్న ఎంపీ సర్వే.. శుక్రవారం ఉదయం పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ ఇంటికి చేరుకుని మంతనాలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిక్కెట్లు అమ్ముకోవడం అనేది తమ పార్టీలో ఉండే సంస్కృతేనన్నారు.
నిజమైన కార్యకర్తలకు, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు దక్కడ పోవడం ఇపుడు మాత్రమే కాదని, గత చరిత్రే ఇపుడు పునరావృత్తం అవుతోందన్నారు. ఇకపోతే.. డీఎస్ నివాసంలో తనకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మధ్య తోపులాట జరిగిందని మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ.. తామిద్దరం అన్నదమ్ములలాంటి వారమన్నారు.
మా ఇద్దరిలో ఎవరికీ అన్యాయం జరిగినా ఊరుకోబమన్నారు. అయితే, నిజమైన కార్యకర్తలకు టిక్కెట్లు దక్కక పోతే మాత్రం అసలు పోరాటం అపుడు జరుగుతుందన్నారు. అంతేకాకుండా టిక్కెట్లు అమ్ముకున్న వారి పేర్లను కూడా బయటపెడతామని ఎంపీ సర్వే సత్యనారాయణ ప్రకటించారు.