జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కాంగ్రెస్‌లో ధర్మపురి మాటకే విలువలేదు: కోటగిరి (PRP | Congress | Alliance | Chiru | Kotagiri | Greater | Election | Candidates | List)
Feedback Print Bookmark and Share
 
కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా అధిష్టానం వద్ద కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ మాటకు విలువలేదనే విషయం తాజా పరిణాలు స్పష్టం చేశాయని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత పొలిట్‌బ్యూరో సభ్యుడు కోటగిరి విద్యాధరరావు ఆరోపించారు.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే 50 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాసే తొలుత ప్రతిపాదన చేశారన్నారు.

అయితే, ఆ పార్టీలో ఆయన మాటకే విలువలేదు. ఇక ఆ పార్టీతో తాము పొత్తు గురించి ఆలోచించే ప్రశ్నేలేదని ఆయన తేల్చి చెప్పారు. ఇకపోతే.. గ్రేటర్ ఎన్నికల్లో తమ కార్యకర్తలు, చిరంజీవి అభిమానులంతా పీఆర్పీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని, అలాగే మరో పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము నిలబెడుతున్న 50 డివిజన్లలోనూ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడమే ధ్యేయంగా కృషి చేస్తామన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.