ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెదేపా గ్రేటర్ మేయర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కృతి (TDP | Greater | Mayor Candidate | Sudheesh Rambhotla | Hyd)
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన సుధీష్ రాంభొట్లా నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆయన స్థానంలో సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మేయర్ అభ్యర్థిగా తెదేపా ప్రకటించింది. ఈయన సైదాబాద్ డివిజన్ పరిధిలో పోటీలో ఉన్నారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరిన సుధీష్ రాంభొట్లా ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల ఆయన నిర్ణీత సయానికి వెళ్లలేక పోయారన్నది ఒక కారణంగా ఉంది. మరోవైపు.. పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ అధిష్టానం బీఫామ్‌ను శుక్రవారం మధ్యాహ్నం 2.45 నిమిషాలకు అందించిందనేది మరో వాదనగా ఉంది.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోక ముందే నామినేషన్ దాఖలు సమయం ముగిసిపోయింది. దీంతో అధికారులు నామినేషన్ దాఖలు చేసేందుకు నిరాకరించారు. ట్రాఫిక్ జామ్ వల్ల సమయానికి రాలేక పోయానని అందువల్ల నామినేషన్ దాఖలకు అనుమతించాలని సుధీర్ రాంభొట్ల చేసిన విజ్ఞప్తిని సైతం అధికారులు తోపిపుచ్చారు.