జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గాంధీ భవన్‌పై రాళ్ళ దాడి: నేతల దిష్టిబొమ్మలు దగ్ధం! (Gandhi Bhavan | Greater | Hyd | DS | Danam | PCC | Tickets | Kirosin)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తుల్లో ఒక్కసారి ఆగ్రహంతో రెచ్చిపోయారు. పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌పై రాళ్ళ వర్షం కురిపించారు. అలాగే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డి.శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

అంతటితో శాంతించని పలువురు కార్యకర్తలు శరీరంపై కిరోసిన్ పోసుకుని ప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. వీరిని వారి అనుచరులు బలవంతంగా అడ్డుకున్నారు. ఇలాంటి సంఘటనలో డీఎస్ నివాసం ఎదుటతో పాటు.. గాంధీ భవన్ వద్ద కూడా జరిగాయి. మరికొందరు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేశారు.

ఇంకొందరు లక్షలు ఇస్తాం.. టిక్కెట్లు కేటాయించండి అంటూ ప్లకార్డులు ధరించి మీడియా ముందు ఫోజులు ఇచ్చారు. మరో కాంగ్రెస్ నేత తాను డబ్బు మూటలు తెచ్చినా తనకు టిక్కెట్ ఇవ్వలేదని డీఎస్ నివాసం ఎదుట ఆరోపించాడు. ఈ సంఘటనలతో ఒక్కసారి రాజధాని పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే గాంధీ భవన్‌తో పాటు.. డీఎస్ నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.