జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నాపై ఆరోపణలు కుట్రలో భాగమే: దానం నాగేందర్ (November | Greater H YD | Elections | Municipal Corporation | Health Minister | Danam Nagendra)
Feedback Print Bookmark and Share
 
నవంబర్ నెలలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో టికెట్లు ఇచ్చేందుకు తాను డబ్బులు తీసుకున్నానని వచ్చిన ఆరోపణలు అవాస్తవ దూరమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు.

తనపై తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందని, ఆ కుట్రలో చాలామంది పెద్ద తలకాయలే ఉన్నాయని, తనను హైకమాండ్ దృష్టిలో చులకన చేయాలని, తనను అవమానించేందుకే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.

సమయం వచ్చినప్పుడు వారి వివరాలు మీడియా ముందు, అధిష్టానం ముందు బయట పెడతానని ఆయన తెలిపారు.

తనపై వచ్చిన లేనిపోని ఆరోపణల నేపథ్యంలోనే మనస్తాపం చెంది గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించినట్లు ఆయన వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.