ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలతో ముఖ్యమంత్రి కె.రోశయ్య శనివారం భేటీ కానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి ఢిల్లీకి వెళ్లిన విషయం తెల్సిందే. ఈ పర్యటనలో రాష్ట్ర రాజకీయ అంశాలతో పాటు..సీఎల్పీ సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికలు, వరద సాయం తదితర అంశాలపై చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలావుండగా, శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన ఆ రాత్రే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. ఆయనతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేసిన ఆయన రెండో రోజు పర్యటనలో భాగంగా సోనియా గాంధీ, ప్రధానిలతో ఆయన భేటీ అవుతున్నారు.