ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి దానం నాగేందర్ (Delhi | Minister Danam | Rosaiah | Greater | Tickets | DS | PCC Chief)
రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపిల్ కార్పొరేషన్ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపుల్లో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. రాత్రికి రాత్రే లక్షలాది రూపాయలకు గ్రేటర్ టిక్కెట్లు అమ్ముకున్నట్టు ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే.
ఆరోపణల నేపథ్యంలో ఆయన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య గ్రేటర్ టిక్కెట్ల కేటాయింపుపై అధిష్టానానికి వివరించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పంపినట్టు సమాచారం. అయితే, ఇది ఎంతవరకు వాస్తవమో తేలాల్సి వుంది.
కానీ, తనపై వచ్చిన ఆరోపణలు, గ్రేటర్ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు తదితర అంశాలపై వివరణ ఇచ్చేందుకు మాత్రం ఆయన ఢిల్లీ వెళ్లాలని మాత్రం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందుకోసం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లే సూచనలు మెండుగా ఉన్నాయి.