ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మా ఇద్దరిలో ఎవరో ఒకరు శిరసావహించాలి: రోశయ్య (Jagan | Rosaiah | Sonia Gandhi | Flood Relief | Election | Delhi | PM)
పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను లేదా వైఎస్ తనయుడులలో ఎవరో ఒకరు శిరసా వహించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. తనను రాజీనామా చేయాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించిన మరుక్షణమే బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆమె నిర్ణయాన్ని ఏ క్షణమైనా శిరసావహిస్తానని రోశయ్య స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోశయ్య శుక్రవారం తొలిసారి ఢిల్లీకి వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అగ్రనేతలు బిజీగా ఉన్నారు. అదేసమయంలో రాష్ట్రంలో వరదలు సంభవించాయని, ఫలితంగా వరద సహాయక చర్యలపై తాను బిజాగా గడిపానని చెప్పారు.
దీంతో వారితో ముందుగా కలుసుకోలేక పోయినట్టు చెప్పారు. ఈ పర్యటనలో వరద సాయాన్ని కోరనున్నట్టు రోశయ్య తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్లను అమ్ముకున్నారంటూ వచ్చిన వార్తలను రోశయ్య స్పందిస్తూ.. ఎన్నికల సమయంలో ఇలాంటివి షరా మామూలేనన్నారు. ఇవన్నీ కాలక్రమంలో సర్దుకు పోతారన్నారు.