జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » దానం నాగేందర్ రాజీనామాను తిరస్కరించిన డీఎస్ (DS | Danam Nagengar | Congress | Hyd | Resign | Delhi)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ లేఖను తిరస్కరిస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో తన నివాసం ఎదుట మీడియాతో మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సక్రమంగానే జరిగినట్టు ఆయన తెలిపారు.

అందువల్ల ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని దానం నాగేందర్ రాజీనామా చేయాల్సిన పని లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పార్టీ క్రమశిక్షణకు లోబడి తక్షణం ఉపసంహరించుకోవాలని డీఎస్ సూచించారు. అలా కాకుండా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అభ్యర్థులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదిలావుండగా, ఉండగా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అధిష్టానం వద్ద వివరణ ఇచ్చుకునేందుకు దానం నాగేందర్ శనివారం ఢిల్లీకి వెళ్లారు. వెళ్ళే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు జరిగిందన్నారు. ఈ సిఫార్సు లేఖలను కూడా అధిష్టానానికి అందజేయనున్నట్టు తెలిపారు.

ఇకపోతే.. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవికి ఇప్పటికే రాజీనామా చేశానని గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా వాటిని సక్రమంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా వంద సీట్లను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.