జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మరో శిశువు మృతి (Vijayawada| Hospital| Children| Ventilator| AP News| News)
Feedback Print Bookmark and Share
 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో గల లోపాలు ఏడుగురు శిశువులను బలికొంది. విజయవాడలోని పాత ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల మధ్య ఈ మృత్యు పరంపర సాగింది.

పిల్లల వార్డులో ఐసీయులో అవసరమైనన్ని వెంటిలేటర్లు లేకపోవడం, ఉన్న ఒక్క వెంటిలేటర్ సరిగా పనిచేయకపోవడం, స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం వంటి కారణాలతో ఆదివారం ఆరుగురు శిశువులు మృతిచెందారు. అలాగే సోమవారం మరో శిశువు మృతి చెందింది. దీంతో మృతి చెందిన శిశువుల సంఖ్య ఏడుకు చేరింది.

ఒకవైపు మరణించిన శిశువుల తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఈ దారుణ సంఘటనకు నిరసనగా పాత ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తెదేపా, పీఆర్పీ, సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుల కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం ప్రకటించేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.