జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గుంటూరులో భారీ పేలుడు: 15 మంది దుర్మరణం (Guntur| Blast| Monday| Cylinder| News| AP News)
Feedback Print Bookmark and Share
 
గుంటూరు జిల్లాలోని ఓ గోడౌన్‌లో సంభవించిన భారీ పేలుడులో 15 మంది దుర్మరణం పాలైయ్యారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలోని ఓ గోడౌన్‌లో సోమవారం ఉదయం భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. రెండు నిమిషాల వ్యవధిలోనే జరిగిన భారీ పేలుళ్లకు 15 మంది మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

బూర్ల వెంకటేశ్వరరావు అనే వ్యాపారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అక్రమంగా నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌కు మంటలు వ్యాపించడం వల్ల భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులే ఉన్నారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

ఇంకా ఈ పేలుడుకు పదికి మించి గృహాలు కుప్పకూలాయని, తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.