ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాజధానిలో నేటి నుంచి సీపీఎం కార్యవర్గ సమావేశాలు! (Capital | Hyd | CPM | CPI | Prakash Karath | Echuri | Raghavulu)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం రాష్ట్ర రాజధానిలో ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్‌తో సహా, పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ, ఇతర అగ్రనేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తం నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో మొదటి రెండు రోజులు సెక్రటేరియట్, చివరి రెండు రోజులు రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు.
ముఖ్యంగా, కేంద్ర, రాష్ట్రాల్లో పార్టీ చేసిన తప్పిదాలపై దిద్దుబాటు చర్యలపై కూడా విస్తృతంగా చర్చించనున్నట్టు రాష్ట్ర శాఖ కార్యదర్శి బీవీ.రాఘవులు తెలిపారు. ఇందుకోసం ఇటీవలే కేంద్ర కమిటీ ఆమోదించిన రెక్టిఫికేషన్ డాక్యుమెంట్‌పై సుదీర్ఘ చర్చ సాగుతుందని చెప్పారు.
అలాగే, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నట్టు తెలిపారు. అలాగే, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చిస్తామని రాఘవులు తెలిపారు.