జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » శిశు మరణాలపై మానవహక్కుల కమిషన్ సీరియస్! (Hospital | Vijayawada | Child | Human Commission | Medical Directorate)
Feedback Print Bookmark and Share
 
రాష్ట్ర వాణిజ్య రాజధాని విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో సోమవారం చోటు చేసుకున్న శిశు మరణాలపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటాగా స్వీకరించిన కమిషన్.. 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర మెడికల్ డైరక్టరేట్‌ను ఆదేశించింది. అలాగే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా వైద్యాధికారికి కూడా ఈ ఆదేశాలు పంపించింది.

ఆస్పత్రిలో వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికాలు అందుబాటులో లేక పోవడంతో ఒక్క ఆదివారమే ఆరుగురు శిశువులు మృతి చెందగా, ఈ ఆస్పత్రిలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పదికి పైగా ఉంది. దీంతో మానవహక్కలు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పసికందుల ప్రాణాలతో ప్రభుత్వం, ఆస్పత్రి వైద్యులు చెలగాటం ఆడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.

సరైన వైద్య పరికరాలు లేకపోతే వైద్యులకు ఎలా చికిత్స చేస్తారని ప్రశ్నించింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకున్న శిశు మరణాలపై తక్షణం సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ ఛైర్మన్ జస్టీస్ సుభాషణ్ రెడ్డి ఆదేశించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.