ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కులేదు: హెచ్ఆర్‌సీ (Junior Doctors| Human rights commision| Vijayawada Hospital| Children)
జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కులేదు: హెచ్ఆర్‌సీ
విధి నిర్వహణలకు ఆటంకం కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కు లేదని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్లు డాక్టర్లు సమ్మెచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి.
ఈ నేపథ్యంలో విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్ల పనిచేయకపోవడం, జూనియర్ల డాక్టర్ల సమ్మెతో ఏడుగురు శిశువులు బలైన సంగతి తెలిసిందే.
ఈ దుర్ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మానవ హక్కుల కమిషన్.. జూనియర్ డాక్టర్ల సమ్మెపై తీవ్రంగా స్పందించింది. జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం అంటే దుష్ప్రవర్తన కలిగి ఉండటేమనని కమిషన్ అభిప్రాయపడింది.
సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని కమిషన్ ప్రశ్నంచింది. దీనిపై మంగళవారం లోపు నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.