ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » పీఆర్పీ నేత ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం! (Parvathaneni Upendra| Health| PRP| Congress| Chiranjeevi| Lagadapati| Murali Mohan)
మూత్రపిండాల వ్యాధితో ప్రజారాజ్యం కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఉపేంద్రను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, సినీ నటుడు మురళీమోహన్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు పరామర్శించారు.
ఇదిలా ఉంటే.. మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత అయిన పర్వతనేని ఉపేంద్ర ఇటీవలే ప్రజారాజ్యం పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పీఆర్పీ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పర్వతనేని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగారు.