జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రామలింగ రాజు అండ్‌ కోకు ల్యాప్‌టాప్ కావాలట! (Ramalinga Raju | Request | laptops | Satyam Computer | Jail | Court)
Feedback Print Bookmark and Share
 
సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగ రాజు, ఆయన అనుచరులు చెంచల్‌‌గూడా జైలులో ప్రత్యేక సౌకర్యాలు పొంది జైలు జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు అయితే ఈ బృందానికి తాజాగా మరో కోరిక కలిగింది. ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని జైలు అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు.

తమ కేసులను వాదిస్తున్న న్యాయవాదులతో సంప్రదింపులు, ఛాటింగే చేసేందుకు ల్యాప్‌టాప్‌లు సమకూర్చాలని కోరారు. ఇందుకోసం కోర్టు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సత్యం కుంభకోణానికి సంబంధించి రామలింగ రాజుతో సహా ఆయన సోదరుడు, మరికొంతమంది అధికారులు గత యేడాదిగా జైలు జీవితం గడుపుతున్న విషయం తెల్సిందే.

వీరికి ఇప్పటికే, వార్తా పత్రికలు, బాత్‌రూమ్ సౌకర్యాలతో కూడిన ప్రత్యేక గదులు, దోమ తెరలు, స్వయం పాకానికి అవసరమైన వంట సరుకులను సమకూర్చుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా తమ న్యాయవాదులు, బంధువులతో ఛాట్ చేసేందుకు, సంప్రదింపులు జరిపేందుకు ల్యాప్‌టాప్‌లను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు వారు జైలు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ పిటీషన్‌ను జైలు అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.