ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జూడాలు సమ్మె విరమించాల్సిందే: హైకోర్టు హెచ్చరిక (Junior Doctors| Strike| AP news| Patients| Gandhi Hospital| High Court)
ఉపకార వేతనం పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు కొనసాగిస్తోన్న సమ్మెను వెంటనే విరమించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. గత వారం రోజులుగా జూడాలు చేస్తున్న సమ్మెపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విధి నిర్వహణలకు ఆటంకం కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కులేదని మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మె విరమించకుంటే వైద్య అర్హత రద్దు చేయాలని ఎంసీఐకి సిఫార్సు చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది.
ఇదిలా ఉంటే.. విజయవాడ పాత ఆస్పత్రిలో వెంటిలేటర్లు సరిగ్గా పనిచేయకపోవడం మరియు జూడాల సమ్మె కారణంగా ఆది, సోమవారాల్లో ఏడు పసికందులు బలైన సంగతి తెలిసిందే.