ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జూడాలపై "ఎస్మా" అస్త్రాన్ని ప్రయోగించిన ప్రభుత్వం! (Junior Doctors| Strike| AP news| Government| SMA act| Patients| Gandhi Hospital)
ఉపకార వేతనాన్ని పెంచాలంటూ వారం రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. విధి నిర్వహణలకు ఆటంకం కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లకు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది.
ఇందులో భాగంగా.. జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం ఎస్మా అనే చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆరునెలల పాటు సమ్మెలపై నిషేధం విధించింది. జూనియర్ డాక్టర్లను మరోసారి చర్చలకు రమ్మని ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు జూడాల ప్రతినిధులు మంత్రి సుదర్శన్ రెడ్డితో భేటీ కానున్నారు.
ఇదిలా ఉంటే.. జూడా సమ్మె కారణంగా గాంధీ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్యసేవలందించేలా చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.
మరోవైపు.. ఆదివారం విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో జూడాలో సమ్మెతో పాటు వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో ఏడుగురు శిశువులు మృతి చెందిన సంగతి తెలిసిందే.