ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కేంద్రంపై రాష్ట్ర ఎంపీలు ఒత్తిడి తేవాలి: రోశయ్య (News| AP News| Rosaiah| MP| Parliament| Floods| Railway| Electricity| Central Government)
పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ఎంపీలు రాష్ట్ర సంబంధిత సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య కోరారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్నందువల్ల ఎన్టీపీసీ నుంచి అదనపు విద్యుత్ సాధించేందుకు ఎంపీలు ప్రయత్నించాలన్నారు.
గురువారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఎంపీలతో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైల్వే శాఖలో మన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. రైల్వే మంత్రి మమత బెనర్జీ తన రాష్ట్రానికి మాత్రమే మేలు కలిగేలా చూసుకుంటున్నారని రోశయ్య తెలిపారు.
అందుచేత రాష్ట్ర ఎంపీలందరూ ఐక్యంతో పెండింగ్ ఉండే ప్రాజెక్టుల పూర్తి కోసం అధిక నిధులు తెచ్చేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అలాగే రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలతో కలిగిన నష్టానికి సహాయం అందేలా కేంద్రంపై ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని రోశయ్య కోరారు.