జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నేడు రాష్ట్రానికి రాహుల్: షెడ్యూల్ వివరాలు! (Rahul Gandhi | Congress | Rosaiah | Tirupati | Warangal | DS)
Feedback Print Bookmark and Share
 
కాంగ్రెస్ యువరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఒక రోజు పర్యటన నిమిత్తం బుధవారం రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన ఉదయం 10.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కృష్ణాజిల్లాలోని గన్నవరం విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి విజయవాడ, వరంగల్, తిరుపతి పట్టణాల్లో పర్యటనకు వెళతారు.

ఈ పర్యటనలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో సమావేశమై, వారి సమస్యలు, ప్రాధాన్యతలను తెలుసుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు. రాహుల్ పర్యటనలో ముఖ్యమంత్రి కె.రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్యక్షుడు డి.శ్రీనివాస్, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారు. కాగా, రాహుల్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

10.20 గంటలకు.. గన్నవరం విమానాశ్రయానికి రాక.
10.40 గం.. విజయవాడ లయోలా కళాశాలకు చేరిక.
10.45-11.25 గం.. విద్యార్థులతు ముఖాముఖి చర్చలు
12.30 గం.. వరంగల్ ఎన్ఐటీ ఆడిటోరియంలో విద్యార్థులతో భేటీ.
02.55 గం.. తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
03.20 గం...ఎస్వీ వర్శిటీ విద్యార్థులో భేటీ.
04.05 గం.. పద్మావతి యూనివర్శిటీ విద్యార్థులతో సమావేశం.
05.05 గం... తిరుపతి నుంచి ఢిల్లీ పయనం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.