ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మైనింగ్ మాఫియాపై పోరాటం చేస్తాం: ప్రకాష్ కారత్ (Prakash Karat| Chandrababu Naidu| Mining Mafia| CPM| News| AP News)
మైనింగ్ మాఫియాపై తెలుగుదేశంతో కలిసి పోరాటం చేస్తామని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ మీడియాతో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ప్రకాష్ కారత్ బుధవారం భేటీ అయ్యారు.
గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. ధరల పెరుగుదల, మైనింగ్ మాఫియా, వరద పరిస్థితులు, కరువు వంటి పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని ప్రకాశ్ కారత్ అన్నారు.
అంతేగాకుండా పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలన్ని ఐక్యతతో వ్యవహరించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రకాష్ కారత్ అన్నారు.