జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అర్కిటెక్ట్‌లకు పద్మశ్రీ ఇవ్వాలి: మంత్రి పిల్లి సుభాష్ (Pilli Subash Chandrabose | ITA | Design | Architect | BSMurthy)
Feedback Print Bookmark and Share
 
WD
WD
భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషించే ఆర్కిటెక్ట్‌లతో పాటు.. ఇంటీరియల్ డిజైనర్‌లకు కూడా పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఆర్కిటెక్‌లందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

చెన్నయ్‌లోని ఇండియన్ తెలుగు అసోషియేషన్ ఆధ్వర్వంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ బీఎస్.మూర్తి (పెడగ్రో మూర్తి)కి సన్మానం తాజాగా చెన్నయ్‌లో జరిగింది. ఆర్కిటెక్ట్ విభాగంతో పాటు.. ఇంటీరియల్ డిజైనింగ్ విభాగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఐఏడీ-2008 జాతీయ అవార్డు ఆయనకు వరించింది.

దీన్ని పురస్కరించుకుని జరిగిన సన్మాన సభలో మంత్రి చంద్రబోస్ పాల్గొని ప్రసంగించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అనే అతిచిన్న ప్రాంతంలో జన్మించిన మూర్తి... చెన్నయ్‌లో స్థిరపడి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆర్కిటెక్ట్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాందించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.

తన వృత్తిపై ఉన్న మమకారం, శ్రద్ధ, అకుంఠిత దీక్ష వల్లే ఇది సాధ్యమన్నారు. జాతీయ స్థాయిలో లభించే ఈ అవార్డుకు ఎంతో మంది పోటీలో ఉన్నప్పటికీ.. వారిని తోసిరాజని రెండు విభాగాల్లో (ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియల్ డిజైనింగ్) విభాగంలో అవార్డును కైవసం చేసుకోవడం ముహదానందంగా ఉందన్నారు.

మూర్తికి చిన్నతంలోనే మెడిసన్‌లో సీటు వచ్చినప్పటికీ.. తనకు ఇష్టమైన ఈ రంగంపై దృష్టి కేంద్రీకరించారన్నారు. దీనికి వారి తల్లిదండ్రుల వైపు నుంచి కూడా ఎంతో ప్రోత్సాహం లభించిందన్నారు. అంటే.. విద్యార్థుల ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటే.. తమ పిల్లలు కూడా ఇలాంటి అవార్డులను సొంతం చేసుకుంటారని మంత్రి అన్నారు.

అదేసమయంలో మూర్తిలో మంచి సేవాతత్పరత, దానగుణాలు ఉన్నాయన్నారు. ఇందుకు ఆయన సొంతవూరైన రామచంద్రపురంలో చేపట్టిన పనులే నిదర్శనమన్నారు. ఇకపోతే.. చెన్నయ్‌లోని ఇండియన్ తెలుగు అసోసియేషన్ నానాటికీ అంతరించి పోతున్న తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను పరరిక్షించేందుకు శాయశక్తులా కృషి చేయడం ప్రశంసదగ్గ విషయమన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో పల్లవా గ్రూపు అధినేత కె.సుబ్బారెడ్డి, అస్కా అధ్యక్షుడు ఎన్.నరసారెడ్డి, పారిశ్రామికవేత్త జేకె.రెడ్డి, ఐఏఎస్ అధికారి జీఏ.రాజ్‌కుమార్, ఐటీఏ అధినేతలు జి.నగేష్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.