జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » భారీవర్షాలతో సీఎం విజయవాడ పర్యటన రద్దు (Vijayawada| Rosaiah| Rahul Gandhi| Heavy Rains| News| AP news)
Feedback Print Bookmark and Share
 
Rosaiah
FILE
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాష్ట్రానికి చేరుకున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్నారు. వర్షాలు పడుతున్న కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీకి రాష్ట్రానికి వస్తోన్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకే ముఖ్యమంత్రి విజయవాడ వెళ్ళాల్సి ఉంది. అయితే విజయవాడలో రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతుండటంతో రోశయ్య పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు.

వాతావరణం అనుకూలిస్తే బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా ముఖ్యమంత్రి విజయవాడకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.