కడప జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. గాలీవుడ్ మండలం తుమ్మిగుంట వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 25 నిమిషాల పాటు ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది.
ఇంకా సంఘటనా స్థలంలో రెండు రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఓ మావోయిస్టు మరణించగా, మరో ఇద్దరు పరారి అయ్యారని పోలీసులు వెల్లడించారు.