జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » భారీ వర్షాలు: ఉప్పుటేరు వాగుకు వరద ముప్పు (Heavy Rains| Upputeru| Flood| Prakasam District| Munneru| News| AP News)
Feedback Print Bookmark and Share
 
ప్రకాశం జిల్లాలోని ఉప్పుటేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ఉప్పుటేరు వాగుకు వరద ముంపు పొంచి ఉంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా చర్యగా కందకూరు-గుడ్లూర్ మధ్య రాకపోకలను నిలిపి వేశారు.

పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో జిల్లా ప్రభుత్వ అధికారులు నిమగ్నమయ్యారు.

మరోవైపు ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో మన్నేరు వాగు కూడా ఉధృతగా ప్రవహిస్తోంది. దీంతో ఉలవపాడు-ఆత్మకూరుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ, రాళ్లపాడు ప్రాజెక్టుల్లో నీటమట్టం పెరగడంతో అధికారులు గేట్లను ఎత్తివేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.