జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జీవిత, రాజశేఖర్‌లు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారు: ప్రరాపా (Jeevitha | Rajasekhar | Congress Party | Uppal | Constituency | PRP | Chiranjeevi)
Feedback Print Bookmark and Share
 
జీవిత, రాజశేఖర్‌లు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని విమర్శించడమే వారు తమ ధ్యేయంగా పెట్టుకున్నారని ప్రజారాజ్యం పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాట్రగడ్డ శంకర్‌బాబు విమర్శించారు.

చిరంజీవిని విమర్శించడమే వారి ధ్యేయంగా కనపడుతోందని, చిరంజీవి నామస్మరణ చేయందే వారికి నిద్ర కూడా పట్టడం లేదని, ఏదో విధంగా వార్తల్లోకి ఎక్కాలనే తాపత్రయం వారిలో కనపడుతోందని, తమ అధినేతను విమర్శిస్తుంటేనే వారికి కాంగ్రెస్ పార్టీలో మనుగడ ఉంటుందని ఆయన అన్నారు.

గతంలో వారు తీసిన సినిమాల్లో నష్టాలు వచ్చాయని, ఆ అప్పులు, నష్టాలను పూడ్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో వేళ్ళాడుతున్నారని, రాజశేఖర్‌కు ఏ రాజకీయ అనుభవం ఉందని తమ పార్టీపై విమర్శలు చేస్తారని ఆయన అన్నారు.

అసలు జీవిత, రాజశేఖర్‌లకు తమ అధినేతను విమర్శించే హక్కు లేదని, ఆయన స్థానమేంటో వారు ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని, తమ పార్టీ అధ్యక్షునిపై విమర్శలు చేస్తుంటేనే వారు మీడియాలో కనపడుతుంటారని, ఈ విధంగానైనా ప్రజలు వారిని గుర్తుంచుకుంటారని వారి మాటల్లో కనపడుతోందని ఆయన విమర్శించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.