ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రంగారెడ్డి నుంచి జగన్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం! (Y.S. Jagan| Greater Elections| Campaign| Rangareddy| News| AP news)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్ తనయుడు, కడప ఎంపీ వైఎస్. జగన్‌మోహనరెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి జగన్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమౌతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
జగన్ గ్రేటర్ ప్రచారంలో భాగంగా.. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రచారానికి బయలుదేరుతారు.
పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కోరిక మేరకు ఈ నెల 20, 21 తేదీల్లో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొంటున్నారని పార్టీ శ్రేణుల సమాచారం.
అలాగే.. ఎల్‌బినగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో జగన్మోహన రెడ్డి సుడిగాలి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.