జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సినీ నటుడు బాలకృష్ణకు అరెస్ట్ వారెంట్ (TDP | NBW | Tollywood | Balakrishna | Actor | Ananthapur | Dharmavaram | Election Campaign)
Feedback Print Bookmark and Share
 
FILE
గతంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నిబంధనలను అతిక్రమించిన కేసులో టాలీవుడ్ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుని హోదాలో పాల్గొన్న బాలకృష్ణకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

వివరాలలోకి వెళితే... అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నటుడు బాలకృష్ణ ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని ఆ జిల్లాలోని ధర్మవరం మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.

తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసిన ఆయన నిర్ణీత సమయానికి మించి ప్రచారం చేశారని స్థానిక పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. దీంతో కోర్టు గురువారం నాడు బాలకృష్ణకు ఎన్‌బిడబ్ల్యూ జారీ చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.